IT job roles
-
IT Jobs: కంపెనీ మారుతున్నారా? హైక్ ఎంతంటే..
చదువు అయిపోయిన వెంటనే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్ వల్ల ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, వారికి లభిస్తున్న అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తర్వాత కొత్త ప్రాజెక్టులు తగ్గడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాల వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలు తీసుకుంటున్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అందులో భాగంగా ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఐటీ రంగం అంతటా కాస్ట్‌కటింగ్ సమస్యే ఉంది. దాంతో కొత్తగా చేర్చుకునే వారికి మునుపటిలా భారీగా జీతాలు పెంచి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి లేదు. కంపెనీ మారాలనుకునే వారి పాత జీతంపై కేవలం 18-22శాతం పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వారికి జీతాల పెంపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటి కంపెనీలోని జీతంతో పోలిస్తే కేవలం 18-22% పెంపుతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అయితే గతంలో అభ్యర్థులు కనిష్ఠంగా 40%, గరిష్ఠంగా 100-120% వరకు వేతనం పెంచాలనే డిమాండ్ చేసేవారని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుతం ఉద్యోగస్థాయిని ఆ డిమాండ్ 35-40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షలు వేతనం ఉండేది. ఈ సంవత్సరం సగటున 8%-16% తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. -
ఈ ఐటీ జాబ్స్ త్వరలో కనుమరుగు
ఆటోమేషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే తగలబోతుంది. ఆటోమేషన్ ముప్పు, కొత్త డిజిటల్ టెక్నాలజీలోకి మరలే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటూ పోతున్నాయి. అంతేకాక కొత్త నియామకాల జోరునూ తగ్గించి, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఆటోమేషన్ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్‌ఫోర్స్ 14 శాతం తగ్గిపోనుందని తెలిపింది. అంటే 2021 వరకు నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడబోతున్నారట. అదేవిధంగా బీపీఓ రంగంలోని సంప్రదాయబద్ధమైన హ్యుమన్ రోల్స్, అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం ఉండవని, ఆటోమేషన్ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాక కొన్ని ఐటీ ఉద్యోగాలు ఇక మనకు కనిపించకుండా కూడా పోతాయని తెలుస్తోంది. ఆన్లైన్ ప్రొఫిషనల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ సింప్లిలెర్న్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయట. అవి ఏమిటో ఓసారి చూద్దాం.. మాన్యువల్ టెస్టింగ్: దీనిలో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూఏ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్ ప్రభావితం కానున్నాయి. ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ : సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీపీఓ : డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్టు సిస్టమ్ మైంటెనెన్స్ : సర్వర్ మైంటెనెన్స్, మైంటెనెన్స్ ఇంజనీర్