ITBP camp
-
ఐటీబీపీ క్యాంప్‌లో తెలుగువారికి ముగిసిన క్వారంటైన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీ నుంచి దేశ రాజధానికి వచ్చిన 36 మంది తెలుగు వారికి ఐటీబీపీ క్యాంప్‌లో బుధవారం క్వారంటైన్ ముగిసింది. ప్రస్తుతం వారిని తమ స్వస్థలాలకు పంపేందుకు ఏపీ భవన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనుమతి కోసం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భవన సక్సేనా ఎదురు చూస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. కేంద్రం అనుమతి వచ్చే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే apbhavancovid19@gmail.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. (పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్ సినిమా? ) -
ఐటీబీపీ క్యాంపుపై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్ గఢ్: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) క్యాంపుపై మావోయిస్టులు రాకెట్లు, భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండంగల్ జిల్లాలోని రాన్ పాల్ ప్రాంతంలో 41 వ ఐటీబీపీ పోలీసు క్యాంపుపై అర్దరాత్రి మూడు వైపుల నుంచి చుట్టు ముట్టి, భారీ ఆయుధాలతో్ మావో్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు తెల్లవారు జామున మూడు గంటల వరకు జరిగాయి. ఇరు వర్గాలు 600 రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం మావోలు వారు అడవుల్లోకి పారి పోయారు. ఇందులో దాదాపు 100 మంది మావోలు పాల్గొన్నట్టు సమాచారం.