మావోయిస్టులు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) క్యాంపుపై రాకెట్లు, భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు.
ఛత్తీస్ గఢ్: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) క్యాంపుపై మావోయిస్టులు రాకెట్లు, భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండంగల్ జిల్లాలోని రాన్ పాల్ ప్రాంతంలో 41 వ ఐటీబీపీ పోలీసు క్యాంపుపై అర్దరాత్రి మూడు వైపుల నుంచి చుట్టు ముట్టి, భారీ ఆయుధాలతో్ మావో్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు తెల్లవారు జామున మూడు గంటల వరకు జరిగాయి. ఇరు వర్గాలు 600 రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం మావోలు వారు అడవుల్లోకి పారి పోయారు. ఇందులో దాదాపు 100 మంది మావోలు పాల్గొన్నట్టు సమాచారం.