J Block
-
మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత
హైదరాబాద్ : సామాన్యులకే కాదు....మంత్రులకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత ఏర్పడింది. సచివాలయంలోని జే బ్లాక్లో నీటి సరఫరా నిలిచిపోయింది. జే బ్లాక్ తొమ్మిది మంది మంత్రులతో కొలువు తీరిన విషయం తెలిసిందే. టాయిలెట్లలో నీటి కొరతను అధికారులు పట్టించుకోక పోవటంతో మంత్రులు, షేపీ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్లలో నీళ్లు రాకపోవడం సర్వ సాధారణం. కానీ వీఐపీలు, వీవీఐపీలు ఉండే సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సర్కారు పాలనా తీరు ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. సామాన్యులకు సమస్య వస్తే ఏమాత్రం పట్టించుకోని సచివులు.. ఇప్పుడు తమ సమస్య విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి. -
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు
రాష్ట్రానికి చెందిన 11మంది మంత్రులకు ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఛాంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం కేఈ ప్రభాకర్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పీతల సుజాత, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు సచివాలయంలోని జే బ్లాక్ కేటాయించింది. అలాగే డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్ రెడ్డిలకు సౌత్ హెచ్ బ్లాక్లో ఛాంబర్లు కేటాయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. దాంతో సచివాలయంలో పలు భవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరి కొన్ని భవనాలు తెలంగాణకు కేటాయించిన సంగతి తెలిసిందే.