మత్తయ్య ఫిర్యాదు... కేసు సీఐడీకి అప్పగింత
విజయవాడ: తనకు తెలంగాణ పోలీసులు, టీఆర్ఎస్ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు వ్యవహారంలో ఏ 4 నిందితుడైన జె.మత్తయ్య మంగళవారం విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు 506, 387 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతుంది. ఈ తరుణంలో మత్తయ్య కేసును చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ సీఐడీకి అప్పగించింది.