మన పార్టీపై ప్రజలేమంటున్నారు?
మాజీ సీఎం కిరణ్ ఆరా
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేస్తున్న పార్టీపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని, ఇందుకు జిల్లాల్లో పర్యటించాలని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం తనను కలసిన నేతలకు సూచించారు. రాజమండ్రి సభ విజయవంతమయ్యేలా జిల్లాల నుంచి మద్దతుదారులను సమీకరించాలని కోరారు. కిరణ్‌ను మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కొర్ల భారతి, పాముల రాజేశ్వరి, కుతూహలమ్మ తదితరులు కలిశారు.
దాసరితో చర్చలు: కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మాజీ సీఎం కిరణ్‌తో భేటీ అయ్యారని తెలిసింది. తాను ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీపై కిరణ్ దాసరితో చర్చించారు. తమ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన దాసరిని కోరినట్లు సమాచారం. కాగా కిరణ్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి జో ఆంటోనీ, రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ యాదవ్ భేటీ అయ్యారు.
ఆ పార్టీ నేను రిజిస్టర్ చేసిందే: చుండ్రు
‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించింది తానేనని టీడీపీ మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి పేర్కొన్నారు. ఆ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించింది తానేనని, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగిస్తున్నానని చెప్పారు. శ్రీహరి శుక్రవారం కిరణ్‌ను మాదాపూర్‌లోని ఆయన ప్రైవేటు కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి తాను వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు.