బంగ్లా ‘ఎ’పై కర్ణాటక విజయం
మైసూరు: లెఫ్టార్మ్ స్పిన్నర్ జగదీష సుచిత్ (6/60) అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రోజు గురువారం బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనముల్ హక్ (89), షువగత హోమ్ (50 నాటౌట్), నాసిర్ హొస్సేన్ (44) మాత్రమే రాణించారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 40.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సీఎం గౌతమ్ (35 బంతుల్లో 49), శ్రేయాస్ గోపాల్ (40 నాటౌట్) వేగంగా ఆడారు. అల్ అమిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు చేయగా.. కర్ణాటక 287 పరుగులు చేసింది.