‘పేట’లో ఆగిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం భద్రాచలం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణంలో ఆగారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నివాసంలో మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం నాయకులు, అధికారులతో మంతనాలు జరిపారు.
సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం భద్రాచలం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణంలో ఆగారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నివాసంలో మంత్రులతో కలిసి భోజనం చేశారు. గంటపాటు గడిపారు. అనంతరం నా యకులు, అధికారులతో మంతనాలు జరిపారు. సీఎం రాక కంటే ముందే ఆ యన కుటుంబ సభ్యులు కూడా సూర్యాపేటలోని మంత్రి నివాసానికి చేరుకొని భోజనం చేసి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పేటలో ఆగుతున్న సందర్భంగా కొత్తబస్టాండ్ నుంచి మంత్రి నివాసం వరకు, మంత్రి నివాస సమీపంలో దుకాణాలను బంద్ చేయించి ట్రాఫిక్ నిబంధనలు పెట్టడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎస్పీ ప్రభాకర్‌రా వు ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగునా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు.
సీఎం కేసీఆర్‌కు మంత్రి ని వాసం వద్ద పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట మం త్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఉప్పల ఆనంద్, వై.వెంకటేశ్వర్లు, బద్దం అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.