Jalaluddin Haqqani
-
తాలీబన్ - హక్కానీ నెట్వర్క్ మధ్య కోల్డ్‌వార్
-
జలాలుద్దీన్ హక్కానీ మృతి
కాబుల్: ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ అనారోగ్యంతో మృతిచెందినట్లు అఫ్గానిస్తాన్ తాలిబన్ మంగళవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలతో పోరాడుతున్న హక్కానీ నెట్వర్క్ తాలిబన్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. జలాలుద్దీన్ అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా ఆయన కొడుకు సిరాజుద్దీన్ హక్కానీకి నాయకత్వం వహిస్తున్నాడు. 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దురాక్రమణ తర్వాతి దాడుల్లో హక్కానీ పాత్ర ఉంది. భారీ ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని హక్కానీలకు పేరుంది. ఇటీవల కాబుల్‌లో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల వెనక ఈ బృందాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అమెరికా ఉన్నతాధికారుల హత్య, విదేశీయల కిడ్నాప్లలోనూ హక్కానీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గ్వాంటానామో జైలు నుంచి ఐదుగురు అఫ్గాన్ ఖైదీలను అమెరికా విడుదలచేశాకే 2014లో తమ చెర నుంచి అమెరికా సైనికుడిని వదిలిపెట్టారు. అఫ్గాన్‌లో ఉగ్ర ఏరివేతలో నిమగ్నమైన అమెరికా ప్రాధాన్యతా జాబితాలో హక్కానీ ఉంది. పాక్ నిఘా సంస్థకు హక్కానీ నమ్మకమైన నేస్తం అని అమెరికా అడ్మిరల్ మైక్ ముల్లెన్ గతంలో ఆరోపించారు. మిత్రుడు శత్రువుగా.. అమెరికా ఆర్థిక అండతో కీలక నేతగా ఎదిగిన జలాలుద్దీన్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. సోవియెట్ ఆక్రమించుకున్న అఫ్గాన్ భూభాగాన్ని విముక్తం చేశాడు. తర్వాత లాడెన్‌కు మద్దతిచ్చి అమెరికాకు కోపంతెప్పించాడు. 1979–89 మధ్య కాలంలో జరిగిన సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో హక్కానీ ముజాహిదీన్ల తరపున పోరాటం చేశాడు. అమెరికా(సీఐఏ), గల్ఫ్ దేశాలు ముజాహిదీన్లకు అవసరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందించాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్స్ ఆహ్వానించడంతో హక్కానీ వైట్‌హౌస్‌కు వచ్చాడని నాడు పత్రికల్లో కథనాలొచ్చాయి. సోవియట్‌తో యుద్ధం ముగిశాక ఒసామాబిన్ లాడెన్ సహా ఇతర అరబ్ ఉగ్రవాద సంస్థలతో హక్కానీ సన్నిహిత సంబంధాలను కొనసాగించాడు. 1992లో కాబుల్‌ను ముజాహిదీన్లు ఆక్రమించిన అనంతరం ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీ గిరిజన శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించాడు. తాలిబన్ల మిలటరీ కమాండర్గానూ వ్యవహరించాడు. అమెరికా సేనల నుంచి లాడెన్ తప్పించుకునేందుకు సాయం చేశాడు. తాలిబన్లతో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు. ఆ తరువాత కాలంలో అమెరికాకే కొరుకుడు పడని ఉగ్రవాదిగా మారాడు. 2011 నాటికి హక్కానీ నెట్‌వర్క్‌లో 15 వేల మంది కమాండర్లు పనిచేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తమ భూభాగంలో ఉగ్ర ఆవాసాలను సమూలంగా మట్టుపెట్టామని పాకిస్తాన్ ప్రకటించినా, హక్కానీ నెట్వర్క్ చెక్కుచెదరలేదని అఫ్గాన్ అధికారులు ప్రకటించారు. -
ఎవరీ హక్కానీ?
అగ్రరాజ్యం ఆర్థిక అండతో కీలక నేతగా ఎదిగాడు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఆక్రమిత ఆఫ్గనిస్తాన్‌ను సాధించడంలో కీలక భూమికి పోషించాడు. లాడెన్‌కు మద్దతిచ్చి అమెరికా ఆగ్రహానికి గురయ్యాడు...హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ. ఆఫ్గనిస్తాన్–పాకిస్థాన్ రీజియన్‌లో ప్రముఖ ఉగ్రవాద సంస్థగా హక్కానీ నెట్‌వర్క్‌ను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపుల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల బాంబు దాడులు , మానవ హననాలకు పురిగొల్పాడు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న హక్కానీ మృతి చెందినట్లు తాలిబాన్లు ప్రకటించారు. అయితే, 2015లోనూ జలాలుద్దీన్ మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని అప్పట్లో తాలిబన్లు కొట్టిపారేశారు. ముజాహిదీన్ల తరపున పోరాటం సోవియట్-ఆఫ్గన్ యుద్ధం సమయంలో ముజాహిద్దీన్ల తరపును హక్కానీ పోరాటం చేశాడు. అమెరికా(సీఐఏ), గల్ఫ్ దేశాలు ముజాహిద్దీన్లకు అవసరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందించాయి. ఈ సమయంలో అమెరికా, పాకిస్తాన్ల సహాయంతో సోవియట్ ఆక్రమిత ఆఫ్గనిస్థాన్ కోసం ముజాహుదీన్ల తరఫున హక్కాని 1979 నుంచి 1989 వరకు పోరాటం సాగించాడు. ఆ సమయంలోనే తాలిబన్ సంస్థలో కీలక నేతగా ఎదిగాడు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రీగన్స్ హక్కానీని వైట్ హౌస్‌కు ఆహ్వానించాడనే వార్తలు కూడా వచ్చాయి. వైట్‌హౌస్‌ను సందర్శించాడని కూడా మరికొన్ని పత్రికలు రాశాయి. లాడెన్‌ను తప్పించడం కీలక పాత్ర సోవియట్ ఆఫ్గన్ యుద్ధం అనంతరం ఒసామాబిన్ లాడెన్ సహా వివిధ దేశాల్లో ఉన్న లాడెన్ వంటి తీవ్రవాద సంస్థల నాయకులు, ఆర్థిక సహాయం అందించే సంస్థలతో హక్కాని సన్నిహిత సంబంధాలను కొనసాగించాడు. 1992లో కాబూల్‌ను ముజాహిదీన్లు ఆక్రమించిన అనంతరం ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీ గిరిజన శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వహించాడు. తాలిబన్ల మిలటరీ కమాండర్గాను వ్యవహరించాడు. లాడెన్ తప్పించుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. తాలిబన్లను విడిచి రావాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని హక్కానీ తిరస్కరించాడు. తర్వాత కాలంలో అమెరికాకే కొరుకుడు పడని నేతగా తయారయ్యాడు. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకుని పోరాటం సాగించాడు. హక్కానీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించాడు. 2009లో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం హక్కానీ నేతృత్వంలో 4,000–12,000 మంది తీవ్రవాదులు పని చేస్తున్నారు. 2011లో ఆ సంఖ్య 10,000–15,000 మధ్య ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ నెట్‌వర్క్‌కు కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.