చీకటి పడితే ఏనుగుల బీభత్సం
ఎల్లందపేట (శ్రీకాకుళం): రాత్రి అయ్యిందంటే చాలు.. గజరాజులు గ్రామంలోకి చొరబడుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా ఎల్లందపేట మండలం జంబాడ గిరిజన గ్రామం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ గిరిజన గ్రామంలోకి రాత్రి అయ్యిందంటే చాలు ఏనుగులు చొరబడుతూనే ఉన్నాయి.
తిరిగి తెల్లవారగానే కొండపై ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతున్నాయి. గ్రామంలో పలు పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.