jamiat ulema-e hind organization
-
ఇదేం బాధ్యతారాహిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్ పోర్టళ్లలో నకిలీ వార్తల ప్రచారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గతేడాది కోవిడ్ వ్యాప్తికి నిజాముద్దీన్ మర్కజ్ కారణమంటూ కొన్ని ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో వచి్చన వార్తలకు వ్యతిరేకంగా జమియత్ ఉలేమా ఇ హింద్, పీస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ దాఖలు చేసిన సవరణ విజ్ఞప్తి పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం ప్రతులను సొలిసిటర్ జనరల్‌కు అందజేయాలని పిటిషనర్ న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలపై సీజేఐ పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఫేస్బుక్, యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాలు మాకు కూడా స్పందించడం లేదు. వ్యక్తులనే కాదు సంస్థలపైనా ప్రచురణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. వారు న్యాయమూర్తులు, సంస్థలు, వ్యక్తుల గురించి చింతించరు.. కానీ శక్తిమంతులైన వారు చెబితే వింటారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది అందులో ఎన్ని నకిలీ వార్తలు ఉంటాయో. వెబ్ పోర్టళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దేశంలో ఓ వర్గం మీడియా ప్రతీదీ మతపరమైన కోణంలో చూపుతోంది. వార్తలకు మత రంగు పులమడం పెద్ద సమస్యగా మారింది. చివరికి ఇది దేశానికి చెడ్డపేరు తెస్తుంది. ఈ ప్రైవేట్ చానళ్లను నియంత్రించే చర్యలు ఎప్పుడూ కేంద్రం చేపట్టలేదా?’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లను నియంత్రించే యంత్రాంగం ఉంది. వెబ్‌పోర్టళ్లను నియంత్రించే యంత్రాంగం ఉండాలని కేంద్రానికి సూచించలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మతపరంగానే కాదని వార్తలు కూడా సృష్టిస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సోషల్, డిజిటల్ మీడియాను నూతన ఐటీ రూల్స్, 2021 నియంత్రిస్తాయని మెహతా తెలిపారు. ముస్లిం సంస్థల తరఫున హాజరైన న్యాయవాది సంజయ్ హెగ్డే సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలను సమర్థించారు. ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వేర్వేరు హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని తుషార్ మెహతా కోరారు. వేర్వేరు హైకోర్టులు వేర్వేరుగా ఆదేశాలు ఇస్తున్నాయని, దేశం మొత్తానికి సంబంధించిన నేపథ్యంలో సమగ్రత కోసం పిటిషన్లు బదిలీ చేయాలన్నారు. కేంద్రం దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను ప్రస్తుత పిటిషన్‌తో కలిపి జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం ఆరు వారాలపాటు విచారణ వాయిదా వేసింది. -
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : అయోధ్యలోని వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై ఆ సంస్థ చీఫ్ మౌలానా అర్షద్ మదాని మాట్లాడుతూ.. దేశంలోని మెజారిటీ ముస్లింలు అయోధ్య పై సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కొందరు మాత్రమే రివ్యూ పిటిషన్ వద్దనుకుంటున్నారని చెప్పారు. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు తమకు ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. అయోధ్య కేసులో.. మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనేది వివాదస్పద అంశమని ఆర్షద్ తెలిపారు. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. కానీ తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వెలువడిందన్నారు. అందువల్లే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సుప్రీం అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన తరువాత దాఖలైన తొలి రివ్యూ పిటిషన్ ఇదే. మరోవైపు 99 శాతం ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఆదివారం పేర్కొంది. డిసెంబర్ 9 వ తేదీన రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్బీ వెల్లడించింది. అయితే ముస్లింల తరఫున పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్ బోర్డు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కాగా, అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9వ తేదీన కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్టు ఆ తీర్పులో పేర్కొంది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. -
‘ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయండి’
ముంబై: ముస్లిం యువకులపై నమోదైన ఉగ్రవాద కేసుల విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ డిమాండ్ చేసింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై ఆజాద్ మైదాన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మద్ని ప్రసంగించారు. ఉగ్రవాద కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. మైనారిటీల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద కేసుల్లో ముస్లిం యువకులు చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి కేసుల్లో అమాయక ముస్లిం యువకులు అరెస్టవుతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనేక ఉగ్రవాద కేసులకు సంబంధించి అనేక తీర్పులొచ్చాయని, ఆ కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకులు విడుదలయ్యారని అన్నారు. అయితే ఇంకా కొంతమంది కారాగారాల్లోనే ఉన్నారని, ఆ నష్టాన్ని ఏవిధంగా పూడుస్తారంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసుల ఉపసంహరణ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్నారు.