దైవ దర్శనానికి వెళ్తూ...
మృత్యు ఒడిలోకి..
ఆటో బోల్తాపడి ఒకరి మృతి పలువురికి గాయాలు
డ్రైవర్ అజాగ్రత్తే {పమాదానికి కారణం
బాధితులు కరీంనగర్ వాసులు
బచ్చన్నపేట : ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడిన సంఘటన మండలంలోని తమ్మడపల్లి శివారు వద్ద సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన గుంటుకు భారతి(53), జిందం ఉమ-లక్ష్మణ్ దంపతుల కూతురు విశాల, వేములవాడ సత్యనారాయణ కలిసి మహాశివరాత్రి సందర్భంగా కొడవటూరు శ్రీసిద్ధేశ్వర స్వామిని దర్శించుకుందామని బయల్దేరారు. కరీంనగర్ నుంచి జనగామకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి కొడవటూరు వెళ్లేందుకు మచ్చ రామనర్సయ్యకు చెందిన ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు.
ఈ క్రమంలో తమ్మడపల్లి గ్రామసమీపంలోకి రాగానే డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆటో రోడ్డు పక్కకు దూసుకపోయి పెద్ద పుట్ట గడ్డ ఎక్కి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన గుంటుకు భారతి తలకి తీవ్ర గాయాలు కాగా జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆటోలో కూర్చున్న ఉమకు రెండు కాళ్లు విరిగాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.