‘ఆ రక్తంలో ఇన్ఫెక్షన్ లేదు’
సాక్షి, సిటీబ్యూరో: కళ్లు తిరిగి కిందపడటంతో ఆస్పత్రిలో చేరి, ఇన్ఫెక్షన్తో చేయిని కోల్పోయిన బాధితురాలు వైష్ణవికి సరఫరా చేసిన రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. గడువు తీరిన, ఇన్ఫెక్షన్తో కూడిన రక్తం సరఫరా చేసినట్లు బాధితురాలి తండ్రి, చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాము దాతల నుంచి డిసెంబర్ 11న రక్తాన్ని సేకరించి, అన్ని రకాల పరీక్షలు చేసి, ఏ లోపం లేదని తేలిన తర్వాతే జనవరి 3న బాధితురాలికి రక్తం సరఫరా చేసినట్లు తెలిపారు. 2005 నుంచి తాము రక్తనిధి కేంద్రాన్ని నడుపుతున్నామని, ఇప్పటి వరకు తమ సేవల్లో ఎలాంటి లోపం తలెత్తలేదని ఆయన వివరించారు.