‘ఆన్లైన్’ ద్వారా జనసేన సభ్యత్వం: పవన్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ‘ఆన్లైన్’ పద్ధతిలో చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించినట్లు జనసేన పార్టీ మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.