Javed Khan
-
ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జావేద్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సహానటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా జావేద్ ఖాన్ హిందీలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ లాగాన్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ఇండియా, చక్‌దే ఇండియా, సడక్ 2, అందాజ్ అప్పా అప్పా, ఇష్క్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక లాగాన్, వన్స్ అపాన్ టైం ఇన్ ఇండియా చిత్రాలకు అయన అవార్డు కూడా అందుకున్నారు. 2001లో లగాన్ చిత్రానికి గానూ ఆయన అకాడమి అవార్డుకు నామినేట్ అవ్వడం విశేషం. చదవండి: చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ -
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, చాంద్రాయణగుట్ట: రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ వివరాల ప్రకారం.. అచ్చిరెడ్డినగర్‌కు చెందిన మహ్మద్ జావెద్ ఖాన్ అలియాస్ జాడో (28) రౌడీషీటర్. ఎన్నో నేరాలకు పాల్పడ్డ ఈ నిందితుడు పలుమార్లు జైలు జీవితం గడిపాడు. అయినా ప్రవర్తనలో మార్పు లేకుండా దాడులు, బెదిరింపులు, న్యూసెన్స్‌లు చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కామాటీపురా ప్రాంతంలో అటుగా వెళ్తున్న ముస్తఫా ఘాజీ అనే యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఆపి గంజాయి ప్యాకెట్ లాక్కొని బెదిరించి పంపించాడు. (కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్) ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న ముస్తఫా రాత్రి 9.30 గంటల తన స్నేహితులు సయ్యద్ బాబా, ఆనంద్ కుమార్ మిశ్రా, నాజంతో కలిసి కత్తులు, నకల్ పంచ్‌తో అన్సారీ రోడ్డులో జావెద్‌పై దాడి చేసి పొడిచారు. ఛాతి, కడుపు భాగాల్లో దాదాపు ఏడెనిమిది పోట్లు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం ఇన్‌ఛార్జి డీసీపీ గజరావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ పరిశీలించి.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులోనే ఈ హత్యకు తెగబడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
హిందూ గుడికి భద్రతాధికారిగా ముస్లిం వ్యక్తి
వాషింగ్టన్: అమెరికాలోని ఓ హిందూ దేవాలయ భద్రత సిబ్బంది ఇన్ఛార్జిగా ముస్లిం వ్యక్తిని నియమించారు. భారత సంతతికి చెందిన జావీద్ ఖాన్ అమెరికాలోని ఇండియనాలో పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జావిద్ స్వస్థలం భారత్‌లోని ముంబై నగరం. జావీద్ 2001 నుంచి ఇండియానా పట్టణంలో నివాసముంటున్నాడు. ఇండియనాపోలీస్లోని ఈ గుడిని ప్రతిరోజూ వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. వారాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. గుడికి భద్రత అధికారిగా నియమితుడైనందుకు జావీద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనుషులంతా ఒక్కటే, మనమందరం దేవుడి పిల్లలం, దేవుడు ఒక్కడే.. కానీ అనేక రూపాల్లో ఉంటాడ’ని అన్నారు. జావీద్ తన కూతురిని ఒక తెలుగు వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం విశేషం.