సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
∙జాయింట్ డైరెక్టర్ సుబ్బలక్ష్మి
ఎంజీఎం : సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మలేరియా, డెంగ్యూ, మెదడువాపు కేసులు నమోదైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కారణాలు విశ్లేషించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్(ఎపాడమిక్స్) జి.సుబ్బలక్ష్మి సూచిం చారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువగా జ్వరాలు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటా స ర్వే నిర్వహించి, వ్యాధుల ప్రబలకుండా అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, ఐకేపీలతో సమన్వపరుచకుంటూ ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. సమీకృత వ్యాధి సర్వేలె¯Œ్స ప్రాజె క్టు ఐడీఎస్పీలో భాగంగా పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రులు ఫారం–పి (పీహెచ్‌సీకి సంబంధించిన ఫారం) ఫారం–ఎస్ (ఉపకేంద్రానికి సంబంధించినది), ఫారం–ఎల్(ల్యాబ్‌కు సంబంధించినది) రిపోర్టులను తప్పనిసరిగా పంపించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, మధుసూదన్, డీఐఓ హరీశ్‌రాజు, ఐడీఎస్పీ అధికారి కృష్ణారావు, అశోకా ఆనంద్, వెంకటరమణ, సుధీర్, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.