జెండా పండగకు ముస్తాబు
గూడూరు: దసరా సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించే ఆంజనేయస్వామి జెండా మహోత్సవానికి గూడూరు పట్టణం ముస్తాబైంది. పట్టణంలోని ఏ ప్రాంతానికెళ్లినా వివిధ రకాల దేవతామూర్తుల ఆకృతులు, ఆర్చీల ద్వారా పలు సెట్టింగులతో కళకళలాడుతోంది. పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో గల కోనేరును గతంలో కనుమూరు హరిచంద్రారెడ్డి అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం జెండా పండగ సందర్భంగా కళ్లుమిరమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా కోనేరు వెలిగిపోతోంది. సంగం థియేటర్ ప్రాంతంలో కరణాల వీధి జెండా నిర్వాహకులు ఏర్పాటు చేసిన కటౌట్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. తూర్పువీధి, గమళ్లపాళెం ప్రాంతాల్లో ఆర్చీలను ఏర్పాటు చేశారు.