టాటా గోల్డ్‌ప్లస్ ‘ఇప్పుడు ప్లస్, ఎప్పుడూ ప్లస్’
హైదరాబాద్: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ జ్యూయలరీ బ్రాండ్ గోల్డ్‌ప్లస్ ‘ఇప్పుడు ప్లస్ ఎప్పుడూ ప్లస్’ పేరుతో వినూత్నమైన వాగ్దానాన్ని వినియోగదారులకు అందిస్తోంది. అత్యుత్తమ ధరలో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను ఈ బ్రాండు ద్వారా ఆఫర్ చేస్తున్నామని టైటాన్ కంపెనీ సీఈవో(ఆభరణాల విభాగం) సి.కె. వెంకటరామన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ప్లస్, ఎప్పుడూ ప్లస్‌లో భాగంగా మంచి డిజైన్లను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని, అత్యుత్తమ మార్పిడి విలువను పొందవచ్చని, ఆభరణాలకు 100 శాతం తిరిగి కొనుగోలు ధర ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని వివరిస్తూ కొత్తగా మూడు టీవీ ప్రచార చిత్రాలను రూపొందించామని, వీటికి ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు సాహిత్యాన్ని అందించారని వివరించారు.