జ్యోత్స్నకు రూ.25 వేలు సాయం
రామచంద్రపురం :
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, దేవీశ్రీప్రసాద్ తండ్రి, రచయిత సత్యమూర్తి ఆశయసాధనలో ఏర్పాటు చేయబడిందే డోనర్స్ క్లబ్ అని క్లబ్ ప్రతినిధులు తాడాల సత్యనారాయణ, తొగరు మూర్తి అబ్బాయిరెడ్డి వెల్లడించారు. డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్లు ముఖ్య అతిథులుగా విచ్ఛేశారు. ఈ సందర్భంగా మండలంలోని హస¯ŒSబాదకు చెందిన ఎముకల వ్యాధితో బాధపడుతున్న కొప్పిశెట్టి జ్యోత్స్నకు డోనర్స్ క్లబ్ ద్వారా రూ.25వేల నగదును వారు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేతుల మీదుగా క్లబ్ ప్రతినిధులు అందించారు. జ్యోత్స్న సమస్యపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి క్లబ్ నిర్వాహకులు స్పందించారు. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్యమూర్తిగా ఎదగాలన్నారు. అనంతరం కృత్తివెంటి పాఠశాల విద్యార్దులకు పెద్ద బాల శిక్ష పుస్తకాలను, బేతస్థ అంద వికలాంగులకు దుప్పట్లను వారు పంపిణీ చేశారు. యువత కోరిక మేరకు శంకర్‌దాదా జిందాబాద్ పాటపాడి ఉర్రూతలూగించారు. త్వరలో రాబోయే చిరంజీవి ఖైదీనంబర్ 150లోని రత్తమ్మ.... రత్తమ్మ అనే పాట అందరినీ అలరిస్తుందన్నారు. విస్సు మాస్టారు వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో డోనర్స్ క్లబ్ సభ్యులు చందమామవాసు, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.