బెలూన్ బొమ్మ.. అదిరిందమ్మా...
ఈ భారీ బెలూన్ శిల్పాన్ని చూశారా.. దీని ఎత్తు 50 అడుగులు. న్యూయార్క్‌కు చెందిన జాన్ రీడ్ అనే బెలూన్ ఆర్టిస్ట్ ఇటీవల రూపొందించారు. మొత్తం 42 గంటలు శ్రమించి.. రోబో బొమ్మలాంటి బెలూన్ శిల్పాన్ని ఆయన తయారుచేశారు. ఇందులో మొత్తం 4,302 బుడగలున్నాయి. ఓ వ్యక్తి రూపొందించిన బెలూన్ శిల్పాల్లో ఇదే అత్యంత పెద్దదని.. ఈ రికార్డు యత్నాన్ని వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు.