సీఎంఆర్ ఇవ్వని వారిపై కఠిన చర్యలు
జేసీ ఇంతియాజ్
నెల్లూరు : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా చేయని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలు లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోపు వంద శాతం సీఎంఆర్ సరఫరా చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. డీఎస్ఓ టి. ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
వినతులు సత్వరమే పరిష్కరించండి : జేసీ
ప్రజలు సమస్యలపై అందజేసిన వినతులను సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన వాటిని మీ–కోసం ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్వో మార్కండేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ 14 ఫిర్యాదులు
కలెక్టరేట్లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు 14 మంది ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. జేసీ ఇంతియాజ్ డయల్ యువర్ కలెక్టర్‌కు ఫోన్ చేసిన వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.