‘క్రీడలను పాఠ్యాంశంగా చేర్చాలి’
జింఖానా, న్యూస్‌లైన్: పాఠశాల విద్యలో క్రీడలను పాఠ్యాంశంగా చేర్చడంపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘క్రీడారంగంలో భారత దేశ ప్రస్తుత పరిస్థితి’పై సెమినార్ జరిగింది.
యూరప్ దేశాల్లో క్షేత్ర స్థాయి నుంచే క్రీడలపై అవగాహన కల్పిస్తారని మాజీ టెస్టు క్రికెటర్ నర్సింహా రావ్ తెలిపారు. ఇందులో ఏపీ ప్రభుత్వ క్రీడా రంగ మాజీ సలహాదారు డాక్టర్ చిన్నప్పరెడ్డి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జి.పి రావ్ తదితరులు పాల్గొన్నారు.