27న జూనియర్ ఫుట్‌బాల్ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు : మెదక్‌లో అక్టోబర్ ఐదునుంచి ఏడు వరకు నిర్వహించే జూనియర్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొనే జిల్లా బాలుర జట్లను ఈనెల 27న స్థానిక స్టేడియంలో ఎంపిక చేయనున్నట్లు ఫుట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధి గజానంద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని వివరాలకు 9440765228 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.