జెఎస్డబ్ల్యు ఎనర్జీ చేతికి జెఎస్పిఎల్ యూనిట్
న్యూఢిల్లీ:
ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రూ 46,000 కోట్ల రుణభారంతో ఉన్న సోదరుడు నవీన్ జిందాల్ ను ఆదుకోవడానికి జెఎస్డబ్ల్యు ఎనర్జీ అధిపతి సజ్జన్ జిందాల్ ముందుకొచ్చారు. దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థ గా రూపొందే వ్యూహంలో బాగంగా భారత అగ్రశ్రేణి ఉక్కు సంస్థ జెఎస్డబ్ల్యు ఎనర్జీ ఈ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ నేతృత్వంలోని అగ్రగామి సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జెఎస్పిఎల్) ను ఆదుకోవడానికి రంగం సిద్దం చేశారు. చత్తీస్గఢ్ లోని పవర్ ప్లాంట్ ను జెఎస్డబ్ల్యు ఎనర్జీ యూనిట్ ను రూ .6,500 కోట్లకు జెఎస్డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకోనుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నట్టు ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.
రాయపూర్ లోని జెఎస్పిఎల్ చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను కొనుగోలు చేయనున్నట్లు జెఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ తెలిపారు. ఆస్తులను విక్రయించడానికి చూస్తున్న నేపథ్యంలో మోనేటిజేషన్ లో భాగంగా ద్రవ్య సరఫరా, ఉత్పత్తి ప్రణాళికలను రూపొందించే ప్రణాళికతో ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం విలువ రూ .4,000 కోట్లు, సంస్థ ప్రస్తుత నికర ఆస్తులు మొత్తం రూ .6,500 కోట్లకు చేరిందని జిందాల్ ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందం 2018 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ కొనుగోలు ద్వారా బొగ్గు ఉత్పత్తిలో తూర్పు భారతదేశం లో పట్టు సాధించాలనేది ప్లాన్.
అటు జెఎస్పిఎల్ దాని అప్పులను తీర్చేందుకు కూడా ఈ డీల్ సహాయం చేస్తుంది. మరోవైపు రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న టాప్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) కు కూడా ఇది ఒక వరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తాజా ఒప్పందంతో జెఎస్ డబ్ల్యు ఎనర్జీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,531 మెగావాట్లకు పెరగనుంది.అటు ఈ ప్రకటన ఫలితంగా షేర్ మార్కెట్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ భారీగా లాభపడింది. 3.5 శాతం లాభాలతో షేర్ ధర రూ 71. 45 దగ్గర ట్రేడ్ అవుతోంది.
గతంలో జిందాల్ సోదరులు విదేశీ ఆస్తులను కొనుగోలులో పోటీ పడ్డారు , కానీ సుప్రీంకోర్టు బొగ్గు గనుల లైసెన్సులు రద్దు చేయడం, కమోడిటీ మార్కెట్ల బలహీనత జేఎస్సీఎల్ లాభాలను ప్రభావితం చేశాయి. అటు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై దిగుమతి సుంకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని సూచనలు కూడా చేశారు. దీంతో జిందాల్ సోదరులు తమ వ్యాపార ఎత్తుగడలను సమీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది.