july 25
-
జూలై 25న జర్నలిస్టులకు పాస్‌పోర్టు మేళా
హైదరాబాద్ : ఈ నెల(జూలై) 25వ తేదీన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రామాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ కోశాధికారి పీవీ శ్రీనివాసరావు, కార్యదర్శి రాజమౌళిచారితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే ఈనెల 22 నుంచి 24 వరకు జర్నలిస్టులందరూ ప్రెస్‌క్లబ్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. అందుకు తమ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్నారు. ఫైల్ ప్రాసెస్ ఏవిధంగా చేయాలో వారు సూచిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే 25న నిర్వహించే పాస్‌పోర్టు మేళాకు అనుమతి ఉంటుందన్నారు. -
జులై 25న మెడికల్ ప్రవేశ పరీక్ష
- క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో అనివార్యమైన రీ- ఎగ్జామ్ - సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్ఈ - జులై 25 న పరీక్ష.. ఆగస్టు 17 లోగా ఫలితాలు న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఆలిండియా ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ జులై 25న జరగనుంది. ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో గడిచిన మే 5న జరిగిన ప్రవేశ పరీక్షను సుప్రీంకోర్టు రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు ఆదేశాలప్రకారం తాజాగా రూపొందించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ అధికారులు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. ముఖ్యాంశాలు.. - పరీక్ష పునఃనిర్వహణ: జులై 25 - ఫలితాల విడుదల: ఆగస్టు 17 లోగా - మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తకి గడువు: ఆగస్టు 28 - రెండోదశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 4లోగా - చివరి, మూడో దశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 11లోగా ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో పరీక్షను రద్దుచేసిన సుప్రీంకోర్టు అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. మెత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్షకు హాజరయ్యారు. మెదట హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరూ ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా జూలై 25 న నిర్వహించే పరీక్షకు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు.