ఓవరాల్ చాంప్ తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. తమిళనాడు జట్టు మొత్తం 873 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కేరళ 753 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కర్ణాటక (417) మూడో స్థానం పొందగా, తెలంగాణ (276), ఆంధ్రప్రదేశ్ (213) జట్లు వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో తమిళనాడు 28 స్వర్ణాలు, 33 రజతాలు, 28 కాంస్యాలు చేజిక్కించుకుంది. తెలంగాణ జట్టు 8 పసిడి పతకాలతో పాటు 10 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకుంది. ఏపీ జట్టు నాలుగేసి చొప్పున స్వర్ణ, రజతాలు, 9 కాంస్య పతకాలు నెగ్గింది. ఓవరాల్ చాంపియన్ తమిళనాడు బృందానికి తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) అధ్యక్షుడు సవ్యసాచి ఘోష్ (ఐఏఎస్) ట్రోఫీని అందజేశారు.
ఫలితాలు
అండర్-14 బాలురు: 600 మీ. పరుగు: 1. శ్రీకాంత్ (టీజీ), 2. ధనుష్ (తమిళనాడు), 3. నిర్మల్ (తమిళనాడు); లాంగ్‌జంప్: 1. భగ్వాన్ (కర్ణాటక), 2. కన్నారావు (టీజీ), 3. మైకేల్ (తమిళనాడు).
అండర్-16 బాలురు: 200 మీ. పరుగు: 1. నవీన్ (తమిళనాడు), 2. నరేశ్ (టీజీ), 3. శివ (ఏపీ); 3000 మీ. పరుగు: 1. అజిత్ (కేరళ), 2. ఆకాశ్ (కేరళ), 3. లక్ష్మణ్ (కర్ణాటక); 5000 మీ. రేస్ వాక్: 1. నితీశ్ (కేరళ), 2. రంజీత్ (తమిళనాడు), 3. విఘ్నేశ్ (తమిళనాడు); లాంగ్‌జంప్: 1. శ్రీశంకర్ (కేరళ), 2. జాన్ (తమిళనాడు), 3. లోకేశ్ (కర్ణాటక).
అండర్-18 బాలురు: 200 మీ. పరుగు: 1. జోసెఫ్ జో (కేరళ), 2. జ్యోతి ప్రసాద్ (కేరళ), 3.సాదత్ (కర్ణాటక); 800 మీ. పరుగు: 1. డింపు కరియప్ప (కర్ణాటక), 2. అజిత్ (కేరళ), 3. రాజాదురై (తమిళనాడు); 3000 మీ. పరుగు: 1. బిపిన్ పటేల్ (కర్ణాటక), 2. అభిత్ (కేరళ), 3. సంజయ్ (కేరళ); 400 మీ. హర్డిల్స్: 1. సంతోష్ (తమిళనాడు), 2. బాలకృష్ణన్ (తమిళనాడు), 3. యశ్వంత్ (ఏపీ); ట్రిపుల్ జంప్: 1. ట్విన్స్ (కేరళ), 2. రియాజ్ షరీఫ్ (కేరళ), 3. సందేశ్ (కర్ణాటక).
అండర్-20 బాలురు: 200 మీ. పరుగు: 1. సతీశ్ (తమిళనాడు), 2. జితేశ్ (కేరళ), 3. ప్రకాశ్ (తమిళనాడు); 800 మీ. పరుగు: 1. రాజేంద్రసింగ్ (టీజీ), 2. రషీద్ (కేరళ), 3. మిజో చాకో (కర్ణాటక); 400 మీ. హర్డిల్స్: 1. జబీర్ (కేరళ), 2. అరుణ్ (తమిళనాడు), 3. ఫెర్నాండెజ్ (తమిళనాడు); 3000 మీ. స్టీపుల్ చేజ్: 1. షిజో రాజన్ (కేరళ), 2. హర్య (టీజీ), 3. యెల్లప్ప (కర్ణాటక); షాట్‌పుట్: 1. జాసన్ (కర్ణాటక), 2. అకేశ్ కుమార్ (కేరళ), 3. నిర్మల్ (తమిళనాడు).