'జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకుంటాం'
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరి కృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపధ్యంలో అతని కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వం అని ఓయు విద్యార్థి జెఎసి హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జెఎసి డిమాండ్ చేసింది.
తన తండ్రి రాజీనామా వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ మెడకు చుట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.