గోల్ఫర్ శుభమ్ సంచలనం
భారత కుర్రాడు శుభమ్ జగ్లాన్ సంచలనం సృష్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఐఎంజీ అకాడమీ ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పదేళ్ల ఈ ఢిల్లీ బాలుడు విజేతగా నిలిచాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించడం విశేషం.