సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియామకం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ టీఎస్ ఠాకూర్(63)ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీకాలం డిసెంబర్ 2న ముగియనుండటంతో.. డిసెంబర్ 3న జస్టిస్ ఠాకూర్ నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
జడ్జీల నియామకానికి ముసాయిదా ఇవ్వండి!
ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి నియమ, నిబంధనలతో ఒక ముసాయిదా(మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్)ను రూపొందించాల్సిందిగా బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొలీజియం స్థానంలో ఎన్జేఏసీని తీసుకురావాలనుకున్న కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల వ్యతిరేకించిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై నిబంధనావళిని రూపొందించాలంటూ అదే ప్రభుత్వాన్ని ఆదేశించింది.