పుణే నుంచి మ్యాచ్‌లను తరలించగలరా?
బీసీసీఐని అడిగిన బాంబే హైకోర్టు
ముంబై: రాష్ట్రంలో నెలకొన్న నీటి కరవును దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ మ్యాచ్‌లను పుణే నుంచి తరలిస్తారా? అని బీసీసీఐని బాంబే హైకోర్టు అడిగింది. ఈ విషయంలో సమాధానమిచ్చేందుకు జస్టిస్ వీఎం కనడే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బెంచ్ నేటి (బుధవారం) వరకు గడువునిచ్చింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కరవు సహాయక నిధికి ఏమైనా విరాళం ఇవ్వగలరా అని కూడా ప్రశ్నించింది. అయితే తాము పిచ్‌లను తడిపేందుకు మంచి నీటిని కాకుండా శుద్ధి చేసిన మురుగు నీటిని వాడతామని విచారణ సందర్భంగా బోర్డు కౌన్సిల్ రఫీఖ్ దాదా కోర్టుకు తెలిపారు.
దీనికోసం రాయల్ వెస్ట్రన్ ఇండియా టర్ఫ్ క్లబ్ (ఆర్‌డబ్ల్యుఐటీసీ)తో టైఅప్ అయ్యామని గుర్తుచేశారు. ‘ప్రతీ రోజు 7 నుంచి 8 వరకు ఇలాంటి ట్యాంకర్లు స్టేడియాలకు సరఫరా అవుతాయి. మురుగు నీటిని శుద్ధి చేసి ఇతర పనులకు ఉపయోగించాలి’ అని రఫీఖ్ చెప్పారు. పుణేలో 9, ముంబైలో 8మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అలాగే నాగ్‌పూర్‌లో జరగాల్సిన తమ 3 హోం మ్యాచ్‌లను మొహాలీకి తరలిం చేందుకు కింగ్స్ ఎలెవన్ అంగీకరించింది.