jwellery theft
-
కొడుకును జైలు పాలు చేసిన తల్లి వాట్సాప్ స్టేటస్
సాక్షి, హైదరాబాద్: ఒక మహిళ వాట్సాప్ స్టేటస్ ఆమె కొడుకు అరెస్ట్ కావడానికి కారణమయ్యింది. 15నెలల క్రితం నమోదయిన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో వాట్సాప్ స్టేటస్ ఉపయోగపడింది. ఈ సంఘటన హైదరాబాద్ రాచకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జూలై 12, 2019లో సాయికిరణ్ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుంటు లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం దొంగిలించినట్లు కనుగొన్నాడు. తన ఇంట్లో చోరి జరిగినట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఇన్ని రోజుల తరువాత వారి ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. ఇది చూసిన కిరణ్ అది తమ ఇంట్లో దొంగిలించినదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. చదవండి: హైదరాబాద్: యువతుల అదృశ్యం.. టెన్షన్ -
నమ్మిన ఇంటికే కన్నం పెట్టిన స్నేహితురాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మి ఇంట్లోకి రానిస్తే స్నేహితురాలి ఇల్లుగుళ్ల చేసిందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన వంగావోలు సునితదేవిని, దొంగిలించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన గోశిక నరసింహ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.2లక్షల విలువైన 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీసీ వెంకటేశ్వరరావు ఎల్బీ నగర్లోని తన కార్యాలయంలో మీడియాకి వివరాలను వెల్లడించారు. -
నగలు దోచుకుని పిల్లల్ని వదిలేసి..
హైదరాబాద్ సిటీ: ఇద్దరు చిన్నారులు అపహరణకు గురైన సంఘటన నగరంలోని ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ నివాసముంటున్న భవాని(7), పల్లవి(4) అనే ఇద్దరు పిల్లల్ని ఆదివారం గుర్తుతెలియని మహిళ అహరించింది. అనంతరం మాయమాటలు చెప్పి వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకుని రహమత్ నగర్లో విడిచి పెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఆర్నగర్ పోలీసులు పిల్లల్ని వెతికి క్షేమంగా తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవేలు వద్దకు చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.