అనాథలు, మానసిక వికలాంగులకు పోటీలు
న్యూశాయంపేట : జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ బాలలు, మా నసిక వికలాంగులకు సాంస్కృతిక, ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు దూదిపాల జ్యోతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈనెల 27, 28, 29వ తేదీల్లో బాలసముద్రంలోని మల్లికాంబ మనోవి కాస కేంద్రంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు శుక్రవారంలోగా పేర్లను మల్లికాంబలో సమర్పించాలన్నారు. వివరాలకు 99481 30367, 99661 59848 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.