K. Bhaskar
-
‘వాళ్లకి వేతనం ఇవ్వకండి’
ఏలూరు (పశ్చిమగోదావరి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహించారనే కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 59 మంది అధికారులకు జీతాలను నిలిపివేస్తూ కలెక్టర్ కె.భాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఖజానా అధికారి సోమవారం ఎస్కేవీ మోహనరావుకు ఆదేశాలిచ్చారు. వివిధ అంశాలకు సంబంధించి గడచిన మూడు నెలల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లాలోని 59 శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఏప్రిల్ 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. గడువు దాటినా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులకు జరిమానాలు సైతం విధించారు. వాటిని చెల్లించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి జీతాలను నిలుపుదల చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రానికి 10 మంది అధికారులు జరిమానాలను చెల్లించారు. అలాంటి వారికి జీతాలు ఇబ్బంది లేకుండా చెల్లిస్తామని జిల్లా ఖజానా అధికారి మోహనరావు చెప్పారు. -
ఆగాగు.. హెల్మెట్ ఏదీ..?
సాక్షి నెట్వర్క్ : రోడ్లపై దూసుకుపోతున్న టూ వీలర్లకు ‘హెల్మెట్’ బ్రేకులు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి హెల్మెట్ తప్పనిసరన్న నిబంధన అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేట్టారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను ఆపి, వందేసి రూపాయలు ఫైన్ వేశారు. అప్పటికప్పుడు హెల్మెట్ కొనుక్కొని వచ్చిన వారికి వాహనాలను తిరిగి ఇచ్చారు. వెంటనే కొనడానికి డబ్బుల్లేవని చెప్పిన వారికి జరిమానా విధించారు. మరికొన్ని జిల్లాల్లో హెల్మెట్ లేని వారిని ఆపినప్పటికీ, జరిమానాలు వసూలు చేయలేదు. హెల్మెట్ వల్ల ఉపయోగాలు చెప్పి, వెంటనే కొనాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వాహనాల యజమానులు హెల్మెట్ కొనడానికి కొద్ది రోజులు గడువిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోయినా 2 నెలలపాటు జరిమానాలు విధించవద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో హెల్మెట్ల వాడకాన్ని ఈ నెల రెండో వారం నుంచి కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ నిబంధనను వైఎస్ఆర్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి వాహనాలను నిలిపివేశారు. హెల్మెట్ కొనుక్కుని వచ్చి చూపించాక వదిలేశారు. అప్పటికప్పుడు కొనలేని వారికి రూ.100 జరిమానా వేశారు. విజయనగరంలో హెల్మెట్ ధరించని వాహన చోదకుల నుంచి అపరాధ రుసం వసూలు చేస్తున్న పోలీసులు -
బాలల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :జిల్లాలో బాలల రక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, దత్తత అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సమీకృత బాలల రక్షణ కార్యక్రమాలపై ప్రతినెలా సమీక్షిస్తామన్నారు. బాలలకు సంబంధించిన అన్ని అంశాలపై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పిం చేందుకు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశిం చారు. బాల్య వివాహాలను నిరోధించే విషయంలో అశ్రద్ధ వహిస్తే సంబంధిత తహసిల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు కూడా తమవంతు కృషి చేయూలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపాలని ఏఎస్పీ చంద్రశేఖరరావుకు కలెక్టర్ సూచించారు. భిక్షాటన చేస్తున్న బాలలకు పునరావాసం కల్పించేం దుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో బాలల రక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమైనట్టు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. బాలల దత్తత విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. బాలల అక్రమ రవాణా నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం లోని బ్యూటీపార్లర్‌లో ఐదేళ్ల బాలికను హింసించిన ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో బాలుడు విద్యుత్ షాక్‌కు గురై చెరుు్య కోల్పోయూడని, ఇందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా బాలల సంరక్షణ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ ఆర్.సూయిజ్, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల, బాలల అక్రమ రవాణా నిరోధక కమిటీ సభ్యురాలు టి.విజయనిర్మల, డీసీపీవో సీహెచ్.సూర్యచక్రవేణి, డీఎంహెచ్‌వో కె.శంకరరావు పాల్గొన్నారు.