కబడ్డీకి పెరుగుతున్న ఆదరణ
కడప స్పోర్ట్స్ : దేశవ్యాప్తంగా కబడ్డీ క్రీడకు ఆదరణ పెరుగుతోందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తోటకృష్ణ అన్నారు. ఆదివారం కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో 43వ జిల్లాస్థాయి జూనియర్ విభాగం కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తోటకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రాచీనక్రీడగా వెలుగొందిన కబడ్డీ తర్వాత ప్రాభవం కోల్పోయిందన్నారు. అయితే నేడు తిరిగి జవసత్వాలు పుంజుకుని పూర్వవైభవం సాధిస్తోందన్నారు. కబడ్డీ క్రీడను గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. శాప్ డైరెక్టర్ డి. జయచంద్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీఠ వేస్తున్నాయన్నారు. క్రీడాకారులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోచ్ జనార్ధన్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన వారు ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు వైజాగ్‌లోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపికలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు. కార్యక్రమంలో దంతవైద్యుడు మధుసూధన్‌రెడ్డి, వశిష్ట జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రూపేష్‌రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోవిందు నాగరాజు, సంయుక్త కార్యదర్శి మహేష్‌రెడ్డి, సభ్యులు పుల్లారావు, సుబ్బన్న, ప్రసాద్, అంజని, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన
బాలుర జట్టు :
టి. గంగాధర్‌రెడ్డి, పి. నాగేంద్ర, కె.ప్రశాంత్, కె.శివహరిప్రసాద్, కె.వీరకుమార్‌రెడ్డి, పి.మహేష్‌బాబు, జి.నవీన్, ఎస్.అబ్దుల్అజీస్, కె.విష్ణుప్రసాద్, ఆర్. సునీల్, మేఘసాయి, టి.సి. రాకేష్. స్టాండ్‌బై : ఎం. రాజ్‌కుమార్‌నాయక్, పి.సాయికృస్ణారెడ్డి, పి.మోహన్‌వంశీ, కె. మహేష్‌కుమార్.
బాలికల జట్టు :
ఎ. అపర్ణ, ఎస్.పూజ, బి.కల్యాణి, యు.ఉమామహేశ్వరి, కె. వెంకటపద్మజ, సుష్మ, కె.లక్ష్మిదేవి, ఎ.విజిత, కె.రాణి, ఎ.లక్ష్మిపూర్ణిమ, ఎ. విజయ. స్టాండ్‌బై : అర్చన, మంజుల, మహబూబ్‌చాన్, కె. సుకుమారి.