kabbaddi
-
హోరాహోరీగా మహిళల కబడ్డీ పోటీలు
గుంటూరు రూరల్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాల మైదానంలో రెండు రోజులుగా హోరాహోరీగా పోటీలు జరిగాయి. పోటీల్లో ఒంగోలు డీఎస్ ప్రభుత్వ కళాశాల, ఏఎన్‌యూ , నరసారావుపేట కృష్ణవేణి కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల జట్లు తలపడగా తుది పోరులో ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి డిగ్రీకళాశాల జట్టు ద్వితీయ స్థానం, ఒంగోలు డీఎస్ కళాశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్ర«థమ స్థానంలో నిలిచిన జట్లు సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్లో ఏఎన్‌యూ తరఫున పోటీ చేస్తాయని చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎక్స్పర్ట్ అకాడమీ డైరెక్టర్ పీ శివశంకరరావు, చలపతి విద్యా సంస్థల అధినేత వైవి.ఆంజనేయులు, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు బి ఇన్నయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా మహిళల కబడ్డీ పోటీలు
మహిళలు, కబడ్డీ, పోటీలు womens, kabbaddi, competations tension in womens kabbiddi గుంటూరు రూరల్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాల మైదానంలో రెండు రోజులుగా హోరాహోరీగా పోటీలు జరిగాయి. పోటీల్లో ఒంగోలు డీఎస్ ప్రభుత్వ కళాశాల, ఏఎన్‌యూ , నరసారావుపేట కృష్ణవేణి కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల జట్లు తలపడగా తుది పోరులో ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి డిగ్రీకళాశాల జట్టు ద్వితీయ స్థానం, ఒంగోలు డీఎస్ కళాశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్ర«థమ స్థానంలో నిలిచిన జట్లు సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్లో ఏఎన్‌యూ తరఫున పోటీ చేస్తాయని చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎక్స్పర్ట్ అకాడమీ డైరెక్టర్ పీ శివశంకరరావు, చలపతి విద్యా సంస్థల అధినేత వైవి.ఆంజనేయులు, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు బి ఇన్నయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.