రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు కదిరి విద్యార్థులు
కదిరి టౌన్ : రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు కదిరి విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే మాస్టర్ అక్బర్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోజురై కరాటే రిమెయి ఇండియా పోటీలకు కదిరిలో నారాయణ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థుల్లో కథాస్ విభాగంలో భావన, అఫీఫా, యాసీర్, కీర్తి, భవిష్య, అరవింద్, తషీఫ్, శ్రీహిత బీరానా, దశదిత్యలు ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే విద్యను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాస్టర్, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పద్మజారెడ్డి, రాఘేవంద్ర, చితంబర్‌రెడ్డి, సర్ఫరాజ్, జక్రియా, విష్ణువర్ధన్‌రెడ్డి అభినందించారు.