కైనన్కు కాంస్యం
జైపూర్: జాతీయ సీనియర్ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ కాంస్య పతకాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... కాంస్య పతక పోరులో 14-12తో అధిరాజ్ సింగ్ రాథోడ్ (రాజస్తాన్)పై గెలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఈ పంజాబ్ షూటర్ 14-13తో రణీందర్ సింగ్ (ఒడిశా)పై విజయం సాధించాడు.