kaishika dwadashi mahothsavam
-
శాస్త్రోక్తం కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం శాస్త్రోక్తం నిర్వహించారు. ఉదయం 4.45 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.తిరుమల వసంత మండపంలో శ్రీతులసి దామోదర పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శాస్త్రోక్తం జరిపారు. 26న కార్తీక పర్వదీపోత్సవం..27న పౌర్ణమి గరుడసేవ శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. కాగా, పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న గరుడసేవ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
సాక్షి, తిరుమల : నవంబర్ 1న కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. స్థితికారుడైన మహావిష్ణు వును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. కైశిక ద్వాదశి మహోత్సవాన్ని టీటీడీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. స్నపనమూర్తిగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కైశిక ద్వాదశి రోజు మాత్రమే తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల్లోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా నిర్వహిస్తారు. ఆ రోజు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆరోజు వారపు ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ రద్దు చేసింది. -
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 53,371 మంది భక్తులు దర్శించుకున్నారు. మాడవీధుల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తి సోమవారం కైశిక ద్వాదశి పురస్కరించుకుని తెల్లవారుజామునే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, ఉదయం 9 గంటలకు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవం ప్రారంభమైంది. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతీర్థం వద్ద తీర్థానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
23న కైశిక ద్వాదశి మహోత్సవం
సాక్షి,తిరుమల: తిరుమలలో ఈ నెల 23వ తేదీన కైశిక ద్వాదశి మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆస్థానం నిర్విహ స్తారు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కొలిపే పర్వదినంగా వ్యవహరిస్తారు. సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు. అదే రోజు ఆలయ వెనుక భాగంలోని చక్రతీర్థంలో ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు, పరిచారకులు వెళ్లి అక్కడ వెలసిన సుదర్శన చక్రతాళ్వారు, ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తారు.