చోరీకెళ్లిన దొంగ మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లిలో పప్పుల రాములు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. చోరీ చేసిన తర్వాత వంటగదిలో ప్రమాదవశాత్తూ కిందజారిపడ్డాడు. కిందపడిన సమయంలో తల నేలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
చనిపోయిన దొంగ తిప్పర్తి మండలం కాజీరామారం మండలానికి చెందిన నాగరాజు(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.