లక్ష గారెలతో కాల భైరవ హోమం
నేడు అమలాపురంలో ప్రారంభం ∙గోశాలలో అతి పెద్ద హోమ గుండం ఏర్పాటు
అమలాపురం టౌ¯ŒS :
అమలాపురం గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాల నూతన ప్రాంగణంలో లోక కల్యాణార్థం లక్ష మినప గారెలతో నిర్వహించే కాలభైరవ హోమం శుక్రవారం ప్రారంభం కానుంది. మాఘశుద్ధ అష్టమి శుక్రవారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ హోమాన్ని ఆదివారం ఉదయం 11 గంటల వరకూ దాదాపు 40 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హోమ గుండాన్ని అతి పెద్దదిగా 8్ఠ8 అడుగులతో రూపొందించారు. హోమ యంత్రాలను, యజ్ఞ శాలను సిద్ధం చేశారు.
ఇదీ కాలభైరవుడి విశిష్టత..
పరమ శివుని తమోగుణ స్వరూపుడైన కాల భైరవుడు కాలానికి అధిదేవత. కాలం లాగే నిత్యుడు, శాశ్వతుడు, అనంతుడు. దేవతలు కొలువుండే పుణ్యక్షేత్రాలకు, శరీరమనే దివ్య క్షేత్రానికి పాలకుడు. కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకునే కాలచక్రం కూడా ఆయనే. శునకాన్ని వాహనంగా చేసుకుని తిరిగే కాలభైరవుడు తనను ఆరాధించే వారికి రక్షణగా నిలిచి, అతీంద్రియ శక్తులనొసగుతాడని, దీర్ఘవ్యాధుల నివారణకు, జటిల సమస్యల పరిష్కారానికి కాలభైరవ ఉపాసన శుభప్రదమని భక్తుల విశ్వాçÜం.
అష్టమి విశిష్టత..
అమావాస్య నుంచి పూర్ణిమకు, పూర్ణిమ నుంచి అమావాస్యకు మధ్యగల తిథుల్లో మనఃకారకుడైన చంద్రుడు సమస్థితిలో ఉండే తిథి అష్టమి (ఎనిమిది) మాత్రమే. అష్టమి తిథిని సాధనాత్మకంగా ఉపయోగించుకుని మానసిక సమతుల్యత పొందవచ్చు. జగద్గురువైన కృష్ణుడు దశావతారాల్లో ఎనిమిదో అవతారంగా, అష్టమ గర్భాన, అష్టమ సంతానంగా, అష్టమి తిథిలో జన్మించడం విశేషం. పరమాత్ముని మాయాశక్తి ఎనిమిది విధాలుగా ఉంటుంది. కృష్ణ, దుర్గ, కాలభైరవ, భీష్మ, అనఘ, భువనేశ్వరి, ధూమావతి, భగళాముఖి జన్మ తిథులు అష్టమే. అష్ట భైరవులు, అష్ట దిక్కులు, అష్ట దిక్పాలకులు, అషై్టశ్వర్యాలు, అష్ట భోగాలు, అష్ట సిద్ధులు, అష్ట భుజాలు, అష్ట మాతృకలు, అష్ట మూర్తులు, అష్టాంగ యోగం, అష్టాక్షరి మంత్రం.. ఇలా ఎన్నెన్నో అష్టమి వైభవాన్ని, విశిష్టతను చాటుతున్నాయి.
నేడు నదుల జలాలతో అభిషిక్తుడైన ఏకదంతుడు
ఘనంగా లక్ష దూర్వార్చన, లక్షకలాల పూజ
అయినవిల్లి : స్వయంభువుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా భక్తుల పూజలందుకుంటున్న అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారికి గురువారం సప్తనదీజలాభిషేకం, లక్షదూర్వార్చన, లక్షకలాల పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు ఆధ్వర్యంలో 12 మంది రుత్వికులు ఈ పూజలను జరిపారు. అలహాబాద్ లోని త్రివేణి సంగమం నుంచి గంగ, యమున, సరస్వతి, తమిళనాడులోని శ్రీరంగం నుంచి కావేరి, గుజరాత్లోని ఓంకారేశ్వర్ నుంచి నర్మద, పాకిస్థా¯ŒS ప్రాంతం నుంచి సింధు, రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి గోదావరి జలాలు తెచ్చిన స్వామిని అభిషేకించారు. అనంతరం లక్ష దూర్వార్చన పూజలు చేశారు. భక్తుల విరాళాలతో కొనుగోలు చేసిన లక్ష పెన్నులను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పెన్నులను ఆదివారం నుంచి విద్యార్థులకు వితరణ చేస్తారు. స్వామి ప్రసాదమైన పెన్నులతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థుల నమ్మిక.
6 నుంచి ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి కల్యాణోత్సవాలు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) : ద్రాక్షారామలో వేంచేసిన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్షీ్మసమేత శ్రీనారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వరస్వామి వార్లకు ఈ నెల ఆరోతేదీ దుర్ముఖినామ సంవత్సర మాఘశుద్ద ఏకాదశి సోమవారం నుంచి 12వతేదీ ఆదివారం వరకు పాంచాహ్నిక దీక్షగా ధ్వజారోహణ, దివ్య కల్యాణ మహోత్సవాలు, రాత్రి మృగశిరా నక్షత్ర తులా లగ్నమందు 10.55 నిముషాలకు ముగ్గురు దేవుళ్ల దివ్య కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ పెండ్యాల వెంకట చలపతిరావు గురువారం తెలిపారు. 6న కల్యాణమూర్తులను చేయడం, దివ్య కల్యాణ మహోత్సవాలు, 8న సదస్యం, 9న రథోత్సవం, 10న వసంతోత్సవం, 11న స్వామివార్ల తెప్పోత్సవం, 12న
పుషో్పత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు, 12న బాణసంచా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు.