జయప్రదకు 'కళాశ్రీ'
ముంబై: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ కళాశ్రీ అవార్డు ప్రదానం చేసింది. సినీ రంగానికి జయప్రద చేసిన సేవలకు గుర్తింపు ఈ అవార్డును ప్రకటించింది.
ముంబైలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో జయప్రదకు కళాశ్రీ అవార్డును అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు ఇవ్వడం సంతోషంగా ఉందని జయప్రద అన్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.