రూ.50 లక్షల పెద్దనోట్లు స్వాధీనం
బెంగళూరు (బనశంకరి) : బెంగళూరులోని కళాసీపాళ్య పోలీసులు గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.50 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నారు. చిక్కపేటేకు చెందిన మనోజ్ కుమార్ సింగ్, ప్రతాప్ స్థానిక రెసిడెన్సీరోడ్డులో టెక్స్టైల్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు.
వీరిలో మనోజ్‌కుమార్‌సింగ్ రియల్ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలను సంప్రదించి 30 శాతం కమీషన్‌పై బ్లాక్‌మనీని వైట్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నిఘా పెట్టారు. గురువారం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తుండగా మనోజ్‌తో పాటు ప్రతాప్‌ను అరెస్ట్ చేశారు. అలాగే మరొక వ్యక్తిని, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.