kallakuru
-
కాళ్లకూరులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు
కాళ్ల(పశ్చిమగోదావరి): కాళ్లకూరులో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు. అనంతరం త్రివిక్రమ్ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. -
కాళ్లకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.11.39 లక్షలు
కాళ్ల: కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభువు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హు ండీ ఆదాయాన్ని సోమవారం లెక్కిం చారు. 60 రోజులకు రూ.11,39,363 ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 2.67 గ్రాముల బంగారం, 65 గ్రాముల వెండి లభించిందన్నారు. ఆచంట రామేశ్వరస్వామి ఆలయ ఈవో జీవీ కృష్ణంరాజు, ఆలయ చైర్మన్ అడ్డాల వెంకగణపతిరాజు, ధర్మకర్తలు, సర్పంచ్ అడ్డాల శివరామరాజు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు