విదేశాలకు పంపిస్తానని మోసం చేసింది
హైదరాబాద : విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మహిళను సంతోష్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం....సంతోష్‌నగర్‌కు చెందిన చక్రవర్తుల కల్పవల్లి (40) విశాఖపట్నం గాజువాకకు చెందిన లావణ్యను విదేశాలకు పంపిస్తానని నమ్మించింది.
ఇందు కోసం లావణ్య నుంచి రూ. 1.60 లక్షలు వసూలు చేసింది. విదేశాలకు పంపిస్తానంటూ ఢిల్లీ, కాన్పూర్‌ల వరకూ తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చి చేతులు దులుపుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసానికి పాల్పడిన కల్పవల్లిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.