ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర
కాల్వశ్రీరాంపూర్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాల్వశ్రీరాంపూర్లో బుధవారం ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ ఫోస్టుల ఖాళీలు భర్తి చేయాలని, కేజీ టు పీజి ఉచిత విద్య వెంటనే అమలు చేయాలని, వసతి గృహాలకు పక్కాభవనాలు నిర్మించాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఎంఈవో పోస్టుల ఖాళీలు భర్తీచేసి విద్యావ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తిని సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, అన్నపూర్ణ, మౌనిక, సురేశ్, అశోక్, రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.