విశ్వరూపం-2 తర్వాత సూపర్‌స్టార్
రాబర్ట్ డి నీరో... వయసు 70. కానీ, హీరోగా ఫుల్ బిజీ. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. అల్ పాసినో... వయసు 73. హీరోగా ఈయనగారూ బిజీయే. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాల్సిందే. ఇంతకీ ఈ ఇద్దరి పేర్లూ ఎక్కడా విన్నట్లు లేదే? అని హాలీవుడ్ సినిమాలు ఫాలో అవ్వనివారు అనుకోవడం సహజం. హాలీవుడ్ స్టార్స్‌లో ఈ ఇద్దరికీ ప్రముఖ స్థానమే ఉంది. ఇక, మన భారతీయ సినిమా విషయానికి వద్దాం. ఏడు పదుల వయసు దాటినవారు హీరోలుగా చలామణీ అవ్వడం చాలా చాలా అరుదైన విషయం. కమల్‌హాసన్ ఇటీవల ఈ విషయం గురించి ఆలోచించి ఉంటారు. అందుకే, ఇదే విషయాన్ని ప్రధానాంశంగా చేసుకుని సినిమా తీయాలనుకుని ఉంటారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వరూపం-2’కి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పైన పేర్కొన్న కథాంశంతో కమల్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో సూపర్‌స్టార్‌గా కమల్ నటించబోతున్నారట.
వయసు మీద పడినంత మాత్రాన సూపర్ స్టార్‌గా రాణించే అవకాశం లేదనే అభిప్రాయాన్ని మార్చే విధంగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రంలో తన స్నేహితుడు మరియు మేనేజర్ పాత్రకు అనంత్ మహదేవన్‌ని అడిగారట కమల్. పలు హిందీ, మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు పలు చిత్రాల్లో నటించారు అనంత్. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’లో కూడా నటిస్తున్నారు. దాదాపు పది రోజుల క్రితం ఆయనకు కమల్ ఫోన్ చేసి, తదుపరి చిత్రం గురించి చెప్పారట. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.