సమైక్యాంధ్రపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాలి
రాయదుర్గం,న్యూస్‌లైన్: సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడకుండా రాజకీయ నాయకులు సమైక్యాంధ్రపై త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని కన్నడ సినీ నటుడు ప్రేమ్‌కుమార్ కోరారు. సోమవారం ఆయన తన బంధువుల వివాహానికి రాయదుర్గం విచ్చేశాడు. ఈ సందర్భంగా అక్కడి చేరుకున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ సంఘం చైర్మన్ లక్ష్మీనారాయణ, నాయకులతో కలసి ఆయన సమైక్యాం ధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం ఒక్కటిగా ఉండాలని, ఈ దిశగా రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గత 27 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళన చేస్తున్నారని, దీంతో అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారన్నారు.
30న శత్రువు చిత్రం విడుదల
తాను నటించిన శత్రువు సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు తాను 18 చిత్రాల్లో నటించానని, వాటిలో నెనపెరలి, జతెజతెయలి, పల్లకి, చార్మినార్, చంద్ర, తదితర చిత్రాలు హిట్‌ను ఇచ్చాయన్నారు. తన తల్లిదండ్రులు బసప్ప, శంకుతల రాయదుర్గంలో పుట్టి పెరిగారని, తన బంధువులు ఇక్కడ ఉన్నారని చెప్పారు