Karachi Zoo
-
జూ పార్క్ లో బెంగాల్ టైగర్ మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కరాచీ జూ పార్క్లో బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు శుక్రవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యానికి గురైన పులికి కిడ్నీ చెడిపోవడంతో మృతిచెందినట్టు జీయో న్యూస్ నివేదించింది. సాధారణంగా పులల జీవితం కాలం 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ బెంగాల్ టైగర్ 16 ఏళ్లకే మృతిచెందినట్టు జూ డైరెక్టర్ మహమ్మద్ ఫహీమ్ ఖాన్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత జూ లో పులి చనిపోవడం ఇది రెండోసారిగా పేర్కొన్నారు. గత 2014 జూన్ నెలలో బెల్జియం నుంచి తీసుకవచ్చిన చిన్న పులి జీర్ణశయాంతర సంబంధిత సమస్యలతో మృతిచెందినట్టు తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో కరాచీ జూలో పులులే కాకుండా నక్కలు, జింకలు, ఒంటెలు వంటి మిగతా జంతు జాతులు క్రమక్రమంగా అంతరించిపోతూ వస్తున్నాయని ఫహీమ్ ఖాన్ వెల్లడించారు. -
ముంతాజ్బేగం ఆఫ్రికావాళీ..
మొహం చూస్తే.. మహిళది.. శరీరం నక్కది.. ఏంటీ చిత్రమైన ఫొటో? గ్రాఫిక్కా అని డౌటొచ్చిందా.. గ్రాఫిక్ కాదు.. నిజమే.. అయితే.. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఆ విషయమేమిటో తెలియాలంటే.. మనం పాకిస్థాన్లోని కరాచీ జూకు వెళ్లాలి. అక్కడికి వెళ్లగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ ఉండే బోను వద్దకు వెళ్లిపోతారు. అక్కడే ఈ ‘చిత్రమైన జీవి’ కనిపిస్తుంది. సగం నక్క, సగం మనిషి.. ఈ కాల్పనిక జంతువు నిజంగా లేదు. అక్కడున్నది ఓ మనిషే.. నక్క శరీరం అక్కడుంటుంది.. దాని బుర్ర ప్లేసుతో మాత్రం ఆడ వేషం వేసుకున్న జూ సిబ్బంది మురాద్ అలీ ఉంటాడన్నమాట. మురాద్ అలీది ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉద్యోగం. ఈ కాల్పనిక జీవి తమ భవిష్యత్తును చెబుతాదన్నది కొందరి నమ్మకం. అందుకే.. రోజూ జూ తెరవగానే.. చాలా మంది వచ్చి తమ సమస్యలను చెప్పి.. సలహాలను అడుగుతారు. జూ మొదలవగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ వేషంలో ఉన్న మురాద్ అలీ తన కథ చెప్పడం మొదలుపెడతాడు. 35 ఏళ్ల క్రితం ఆఫ్రికా జూలో తానిలాగే పుట్టానని.. తాను కేక్, పళ్లు మాత్రమే తింటానని చెబుతాడు. తర్వాత జనం తమ ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. మురాద్ అలీ సమాధానం చెబుతూ పోతాడు. ఇలా రోజుకు 12 గంటలపాటు మురాద్ అలీ ముంతాజ్ బేగం అవతారమెత్తుతాడు. కరాచీ జూలో మిగతా జంతువులతో పోలిస్తే.. ముంతాజ్ బేగంకే క్రేజ్ ఎక్కువట.