ముంతాజ్‌బేగం ఆఫ్రికావాళీ.. | muntajbegam in Africa | Sakshi
Sakshi News home page

ముంతాజ్‌బేగం ఆఫ్రికావాళీ..

Published Thu, Jul 3 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

ముంతాజ్‌బేగం ఆఫ్రికావాళీ..

ముంతాజ్‌బేగం ఆఫ్రికావాళీ..

మొహం చూస్తే.. మహిళది.. శరీరం నక్కది.. ఏంటీ చిత్రమైన ఫొటో? గ్రాఫిక్కా అని డౌటొచ్చిందా.. గ్రాఫిక్ కాదు.. నిజమే.. అయితే.. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఆ విషయమేమిటో తెలియాలంటే.. మనం పాకిస్థాన్‌లోని కరాచీ జూకు వెళ్లాలి. అక్కడికి వెళ్లగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ ఉండే బోను వద్దకు వెళ్లిపోతారు. అక్కడే ఈ ‘చిత్రమైన జీవి’ కనిపిస్తుంది. సగం నక్క, సగం మనిషి.. ఈ కాల్పనిక జంతువు నిజంగా లేదు. అక్కడున్నది ఓ మనిషే.. నక్క శరీరం అక్కడుంటుంది.. దాని బుర్ర ప్లేసుతో మాత్రం ఆడ వేషం వేసుకున్న జూ సిబ్బంది మురాద్ అలీ ఉంటాడన్నమాట. మురాద్ అలీది ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉద్యోగం. ఈ కాల్పనిక జీవి తమ భవిష్యత్తును చెబుతాదన్నది కొందరి నమ్మకం.

అందుకే.. రోజూ జూ తెరవగానే.. చాలా మంది వచ్చి తమ సమస్యలను చెప్పి.. సలహాలను అడుగుతారు. జూ మొదలవగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ వేషంలో ఉన్న మురాద్ అలీ తన కథ చెప్పడం మొదలుపెడతాడు. 35 ఏళ్ల క్రితం ఆఫ్రికా జూలో తానిలాగే పుట్టానని.. తాను కేక్, పళ్లు మాత్రమే తింటానని చెబుతాడు. తర్వాత జనం తమ ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. మురాద్ అలీ సమాధానం చెబుతూ పోతాడు. ఇలా రోజుకు 12 గంటలపాటు మురాద్ అలీ ముంతాజ్ బేగం అవతారమెత్తుతాడు. కరాచీ జూలో మిగతా జంతువులతో పోలిస్తే.. ముంతాజ్ బేగంకే క్రేజ్ ఎక్కువట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement