‘ముష్కిల్’ చెప్పే పాఠం
విశ్లేషణ
మన ప్రజలు తమ అభిప్రాయాలను పాక్ ప్రజలకు నేరుగా తెలపొచ్చు. పాక్‌తో క్రికెట్‌కు నిరాకరణ ద్వారా పాక్షికంగా ఇది జరిగింది. అయితే, పాక్ నటులపై వేటుకు బెదిరింపులు అభ్యంతరకరం. ఒక రాజకీయ పార్టీ ఆ పని చేయడం హేయం.
కరణ్ జోహార్ ‘యే దిల్ హై ముష్కిల్’ అక్టోబర్ 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్యవర్తి త్వం వహించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధి నేత రాజ్ థాక్రేకు, కరణ్ జోహార్‌కు మధ్య శాంతి నెల కొనేట్టు చేశారు. కాకపోతే, థాక్రే కోరినట్టుగా సైనిక సంక్షేమ నిధికి కరణ్ జోహార్, సినీ పరిశ్రమలు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారా అనే విషయంలోనే విభేదాలు న్నాయి. ఏదేమైనా ప్రాయశ్చిత్తంగా ఎంతో తెలియని విరాళం చెల్లింపుతోనే పరిష్కారం కుదిరినట్టు అనిపిస్తోంది. అయితే క్లైమాక్స్ ముగిసిపోలేదు, అదింకా మొదలు కావాల్సి ఉంది. కాబట్టి కథ ఇక్కడే మలుపు తిరిగేది. పాకిస్తానీ నటుడు ఫవద్ ఖాన్ నటించినా గానీ ఆ సినిమాను టిక్కెట్లు కొని చూస్తారా? లేదా? అనేదే సినీ ప్రేక్షకులలో ఎవరు ‘‘దేశభక్తులు’’ లేదా ‘‘జాతీయవా దులు’’ అని తేల్చేది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా, లేదా? అనేదే పాక్ కళాకారులతో సినిమాలు తీయడం లేదా వారిని ప్రదర్శనలకు పిలిచే ధోరణికి వ్యతిరేకులకు నిజమైన పరీక్ష అవుతుంది. గోడ మీద కూచున్న వారిని సైతం వారు సృష్టించిన ప్రజాభిప్రాయం ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్లకు దూరంగా ఉంచగలదా? అనేది వేచి చూడాలి. ఆ సినిమాను ‘అనుమతించాలి’ అని ఎంఎన్ఎస్ నిర్ణయించినా, ఒకేS తెర ఉండే థియేటర్లు మాత్రం వెనక్కు తగ్గలేదు. కాగా, మల్టిప్లెక్స్ థియేటర్లు తమ ఆస్తులకు ప్రభుత్వం రక్షణను కల్పిస్తుందనే ఆశా భావంతో ఉన్నాయి. ‘‘ప్రస్తుతం ప్రజల సెంటిమెంటు’’ పాక్‌కు వ్యతిరేకంగా ఉన్నదని ఒక తెర థియేటర్లవారు అంటున్నారు. కానీ, తమ ఆస్తులకు జరిగే నష్టం గురించి గుసగుసలాడుతున్నారు. ఇది, అతిగా జాగ్రత్త వహించడం లేదా సంఘర్షణాత్మక ధోరణిగల ఆ పార్టీ క్యాడర్లలోని దురుసువారి వల్ల ముప్పు ఇంకా ఉండవచ్చని అనుమా నించడం. ఇలా తమ ‘దేశభక్తి’ని, ‘జాతీయవాదా’న్ని బాహాటంగా ప్రదర్శించేది ఎంఎన్ఎస్ ఒక్కటే కాదు.
ఒక ధోరణిని నిర్ణయించగల అంశంగా ప్రజాభి ప్రాయం ఎంత బలంగా ఉన్నదనే దానికి కొన్ని సూచికలు న్నాయి. ఉదాహరణకు, పాక్‌కు చైనా మద్దతు పలుకు తోంది కాబట్టి చైనా వస్తువులను బహిష్కరించాలి అనే పిలుపునే తీసుకోండి. ఐరాస ఉగ్రవాద జాబితాలో పాక్ ఉగ్రవాదు లను చేర్చడానికి చైనా ‘‘సాంకేతిక కారణాలు’’ చూపి, అభ్యంతరం తెలిపింది. అది భారత ప్రజల సెంటి మెంటును దెబ్బతీసింది. దాని ఫలితాలను అప్పుడే చూస్తు న్నాం. రాజస్తాన్‌లో చైనా వస్తువుల లావాదేవీలు 40 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. వాటిలో చైనా తయారీ దీపావళి బాణసంచా నుంచి విద్యుత్ దీపాల వరకు ఉన్నాయి. ఢిల్లీ ప్రధాన బాణసంచా మార్కెట్లలో కూడా అదే ధోరణి కనబడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే దేశం చైనా వస్తువులన్నింటినీ బహిష్కరించే విధంగా ఇంకా జాగృతం కాలేదు. ఇంకా వాడుతున్న వాటిలో సెల్ఫోన్లు, మొబైల్ చార్జర్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇలా దాదాపు ప్రతిదీ ఉంది. వీటిలో అంతర్జాతీయమైనవి, మరీ కచ్చితంగా చెప్పాలంటే అమెరికన్ లేదా దక్షిణ కొరియా బ్రాండ్ల వస్తువులు కూడా ఉన్నాయి. అయితే ఈ చైనా వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని పెంపొందింపజే యడం ప్రభావాన్ని చూపిందనే అనుకుంటున్నా. అది, చైనా పట్ల ప్రజల్లో ఉన్న అసమ్మతిని వ్యక్తం చేస్తోంది. ప్రజ లకూ గొంతు ఉన్నదనీ, తమకు కావాల్సిన దాన్ని వారు ఎంచు కోగలరని అది అందిస్తున్న సందేశం.
పాక్ నటులను తీసుకున్నందుకు బాలీవుడ్‌పై రేగిన ఆగ్రహం కూడా అలాంటిదే. అది, తమ సినిమాల్లోకి పాకి స్తానీలను తీసుకున్న వ్యక్తులకు తప్ప మొత్తంగా సినీ పరి శ్రమను చావుదెబ్బ తీసి సంక్షోభంలోకి నెట్టేసేదేం కాదు. ఇది కూడా, కొంత ప్రాధాన్యం ఉన్న సందేశాన్ని ఇస్తోంది. ఎందువల్లనంటే దేశానికి–దేశానికి మధ్య సంబంధాలకు సంబంధించి, ప్రత్యేకించి పాక్‌తో సంబంధాల విషయంలో ప్రజలకు–ప్రజలకు మధ్య సంబంధాలకు ప్రాధాన్యం ఉన్న దనే వారికి వారు పౌర సమాజంపైన, అధికారిక వ్యవస్థ పైనా బలమైన ప్రభావం చూపగలిగి ఉన్నారు. మరి భారత ప్రజలు తమ అభిప్రాయాలను పాక్ ప్రజలకు తెలి యజేయకూడదా? చేయవచ్చనే అనుకుంటున్నా. ద్వైపా క్షికంగా భారత్‌లో జరగాల్సిన క్రికెట్ కార్యక్రమాల విష యంలో పాక్షికంగా ఇది జరిగింది. పాక్ క్రికెట్ జట్టు ఇక్కడ ఆడటం లేదు. ప్రపంచకప్ తదితర కార్యక్రమాల్లో పాక్‌తో మనవాళ్లు మూడో దేశంలో ఆడు తున్నారు. ఇలా తుపాకీ పేల్చకుండానే సందేశాన్ని పంపగల అవకాశాన్ని వదులు కోకూడదు.
అయితే, ఆ లక్ష్య సాధనకు పనిముట్టుగా బెదిరింపు లను పనిముట్టుగా వాడటం ఈ వ్యవహారంలోని చేదు వాస్తవం. జోహార్‌ను ‘‘చితక బాదుతా’’మని ఎంఎన్ఎస్ సినీ విభాగపు నేత ఒకరు బెదిరించారు. జోహార్ సిని మాను ప్రదర్శించాలని యోచిస్తున్న మల్టిప్లెక్స్‌లను తేలి కగా ధ్వంసం చేయొచ్చనే విషయాన్ని వారు గుర్తుంచు కోవాలని ఆ నేత హెచ్చరించారు కూడా. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పనికి పాల్పడటం అతి హేయమైనది. దుర దృష్టవశాత్తూ దేశం అలాంటి సంస్కృతితో సర్దుకుపోవ డాన్ని నేర్చుకుంటోంది.
( వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు mail : mvijapurkar@gmail.com)